టాటా స్కైపై డిస్కౌంట్‌ ఆఫర్స్‌‌!

-

మీరు టాటాస్కై వినియోగదారులా? అయితే మీకు శుభవార్త. టాటాస్కై అందిస్తోన్న ఆఫర్స్‌ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పటికే కనెక్షన్‌ తీసుకున్నవారితో పాటు కొత్తగా టాటాస్కై డీటీహెచ్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకునేవారికి ఆఫర్స్‌ ప్రకటించింది. సెట్‌ టాప్‌ బాక్స్‌ నుంచి రీఛార్జ్‌ వరకు అనేక ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

  • టాటా స్కై బింజ్‌+ సెట్‌ టాప్‌ బాక్స్‌ తీసుకునేవారికి ప్రీమియం యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. అదేవిధంగా సెట్‌ టాప్‌ బాక్సులపై రూ.400 వరకు డిస్కౌంట్, రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ ప్రకటించింది. ప్రస్తుత టాటాస్కై వినియోగదారులకు సైతం ఈ ఆఫర్స్‌ ఎలా పొందాలో తెలుసుకుందాం.
  • టాటాస్కై బింజ్‌+ సెట్‌టాప్‌ బాక్స్‌ ధర రూ.5,792. కానీ, ఆఫర్‌ ధర రూ.2,499 మాత్రమే. ప్రస్తుత వినియోగదారులకు బింజ్‌+ సెట్‌టాప్‌ బాక్స్‌ను రూ.1,999 చెల్లించి పొందవచ్చు. దీంతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం, జీ5, క్యూరియాసిటీ స్ట్రీమ్, వూట్‌ కిడ్స్, ఎరోస్‌ నౌట్, సన్ నెక్స్‌ట్, హంగామా ప్లే, వంటి పది ప్రీమియం యాప్స్‌కు నెల సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. 3 నెలలు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఉచితంగా పొందవచ్చు. TSKY200 ప్రోమో కోడ్‌ ఉపయోగిస్తే అదనంగా రూ.200 తగ్గింపు ఉంటుంది.
  • టాటా స్కై హెచ్‌డీ సెట్‌టాప్‌ బాక్స్‌ అసలు ధర రూ.1,599. ఆఫర్‌ ధర రూ.1,499. దీంట్లో 500 పైగా ఛానెల్స్‌ యాక్సెస్‌ పొందవచ్చు. అదే విధంగా కుకింగ్, ఫిట్‌నెస్, టాటా స్కై మ్యూజిక్, టాటా స్కై సీనియర్స్‌ లాంటి టాటా స్కై సర్వీసెస్‌ పొందవచ్చు.TSKY150 ప్రోమో కోడ్‌ ఉపయోగిస్తే రూ.150 డిస్కౌంట్‌ లభిస్తుంది.
  •  టాటా స్కై+ హెచ్‌డీ సెట్‌ టాప్‌ బాక్స్‌ ధర రూ.4,999. TSKY400 ప్రోమో కోడ్‌ ఉపయోగిస్తే రూ.400 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో 625 గంటలపాటు లైవ్‌ టీవీ రికార్డ్‌ చేయవచ్చు.
  • టాటా స్కై రీఛార్జులపైనా కూడా ఆఫర్స్‌ ఉన్నాయి. స్పెషల్‌ ఆఫర్‌లో భాగంగా 12 నెలల పాటు రీఛార్జ్‌ చేస్తే ఒక నెల క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. టాటా స్కై పోర్టల్‌ లేదా టాటా స్కై మొబైల్‌ యాప్‌లో రీఛార్జ్‌ చేస్తే ఫ్రీ కూపన్ కూడా లభిస్తాయి. ఫ్రీఛార్జ్‌లో రూ.200 రీఛార్జ్‌ చేస్తే రూ.20 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. మొబీక్విక్‌తో రూ.300 పైన ఎంతైనా రీఛార్జ్‌ చేస్తే రూ.50 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. MKTSKY ప్రోమోకోడ్‌ ఉపయోగించాలి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లు 12 నెలలకు ఒకేసారి రీఛార్జ్‌ చేస్తే 2 నెలలు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
  • టాటా స్కై రిఫర్‌ – ఎర్న్‌ కూడా ప్రకటించింది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు టాటా స్కై రిఫర్‌ చేస్తే మీరు రూ.200 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version