నేడు నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డే..బెంగళూరులో టీడీపీ క్యాంపులు !

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు రోజు కావడంతో వైసీపీ అనేక ప్రలోభాలకు పాల్పడుతోంది. దీంతో జోరుగా ఉపసంహరణల పర్వం నడుస్తోంది. దీంతో అభ్యర్ధులని కాపాడుకునేందుకు విపక్షాలు తంటాలు పడుతున్నాయి. నిన్న భారీగా ఉపసంహరణలు సాగుతున్నాయి.

ఒత్తిడులు , స్వచ్ఛంద ఉపసంహరణలు అన్నీ వైసీపీకే ఉపయోగ పడుతున్నాయి. దీంతో టీడీపీ ఈ ఒత్తిడులు తట్టుకోలేక టీడీపీ క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అభ్యర్ధులతో టీడీపీ బెంగళూరులో క్యాంప్ పెట్టింది. నిన్న ఒక్కరోజే ఏపీ వ్యాప్తంగా 222 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక టీడీపీ లానే జనసేన, బీజేపీలు కూడా అభ్యర్థులను కాపాడుకోవడానికి అనేక తంటాలు పడుతున్నాయి. చూడాలి వైసీపీ ప్రలోభాలను మిగతా పార్టీల వారు ఏమేరకు ప్రయత్నాలు చేస్తారో ?