కుప్పంలో టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌.. చంద్రబాబు పీఏపై ఫిర్యాదు !

చిత్తూరు జిల్లా కుప్పం టిడిపి అభ్యర్థి కిడ్నాప్ సంఘటన కలకలం రేపుతోంది. తెదేపా పార్టీ తరపున 14 వార్డు సమందించి కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసిన ప్రకాష్ తో పాటు వారి కుటుంబ సభ్యులు అదృశ్యం అయ్యారు. ప్రకాష్.. ఆ వార్డు కు సంబంధించి తెదేపా తరపున రెండవ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు సమాచారం అందుతోంది.

అయితే అదే వార్డు కు సంబంధించి తెదేపా అభ్యర్థిగా దాఖలు చేసిన వెంకటేష్ నామినేషన్ స్క్రూటినీ లో సక్రమంగా లేనందు వలన తొలగించబడింది. ఈ నేపథ్యంలోనే తన తమ్ముడు ప్రకాష్ తో పాటు , అతని భార్య, అతని పిల్లలు ఇద్దర్నీ బెదిరించి దౌర్జన్యంగా తీసుకెళ్లారని, వారి ఆచూకీ తెలియడం లేదని పోలీసులకి పిర్యాదు చేశారు ప్రకాష్ అన్న గోవిందరాజులు.

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చంద్రబాబు పి.ఎ మనోహర్, తెదేపా నేతలు ps.మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేష్ లు ఈ దారుణానికి పాల్పడ్డారు అని పిర్యాదు లో పేర్కొన్నారు గోవిందరాజులు. సొంత పార్టీ కి చెందిన అభ్యర్ధి నే ఇలా కిడ్నాప్ చేయడం దారుణమని మండిపడుతున్నాడు గోవిందరాజులు. కిడ్నప్ కాకున్నా భయబ్రాంతులకు గురిచేసే ఉదేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని ఆరోపణ చేస్తోంది టీడీపి.