టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయరాదని పట్టాభిని కోర్ట్ ఆదేశించింది. ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభితో పాటు మిగిలిన వారికి కూడా బెయిల్ మంజూరైంది.
ఈ మేరకు ఆయనకు న్యాయస్థానం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 3 నెలల పాటు ప్రతి గురువారం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే తమను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అయితే విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయరాదని పట్టాభిని కోర్ట్ సూచించింది.
ఇటీవల గన్నవరంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడటం జరిగింది. టీడీపీ ఆఫీసుపై దాడి జరగ్గా, కారు అగ్ని లో కాలిపోయింది. ఈ క్రమంలో, తనను కులం పేరుతో దూషించారంటూ సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత పట్టాభి తదితరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది.