విశాఖ సదస్సుకు వచ్చిన అతిథులకు స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ లు

-

సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు. తొలి రోజే 11.50 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. అయితే.. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు గుర్తుండిపోయేలా విశిష్ట కానుకలతో కూడిన గిఫ్ట్ ప్యాక్ లు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు వస్తువులను ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఉంచారు.

ఇలాంటివి 8 వేల గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం జీఐఎస్-2023 వేదిక వద్ద పంపిణీ చేస్తోంది. ఈ గిఫ్ట్ ప్యాక్ లో కలంకారీ డిజైన్ తో కూడిన పింగాణీ ప్లేట్, నోట్ బుక్, పెన్నులు, తదితర వస్తువులతో పాటు, తిరుపతి లడ్డూను, అరకు కాఫీ, టీ పొడులు, గిరిజన తేనె కూడా అందిస్తున్నారు. కాగా, గిఫ్ట్ లు అందనివారు కొందరు డెలిగేట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద రగడ సృష్టించారు. కొందరు అక్కడున్న తాత్కాలిక ఏర్పాట్లను చిందరవందర చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news