కేసీఆర్‌ది ఊసరవెళ్లి రాజకీయం : టీడీపీ నేత

-

ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఉప ఎన్నికలకు ముందు ఒకచోట దళితబంధు అని, మరోచోట గిరిగిజనబంధు అని ప్రకటించి.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ ఊసరవెళ్లి రాజకీయాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడా? అని ఆయన అడిగారు. మాటమీద నిలబడే వ్యక్తి కేసీఆర్ అని పేర్కొంటున్న మంత్రి దయాకర్ రావు.. ఏ హామీని అమలు చేశారో చెప్పాలని అన్నారు. లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని అడిగారు శ్రీనివాసులు.

KCR opposes move to amend IAS rules: Dangerous, against federalism |  Hyderabad News, The Indian Express

నిరుద్యోగ భృతి ఏమైంది? విద్యార్థులకు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైంది? అని ప్రశ్నించారు. ఆయన. మెస్ చార్జీల పెంపు ఎందుకు చేయలేదు, ఏళ్లతరబడి రేషన్ కార్డులు ఏమయ్యాయి అని అడిగారు. 111 జీవో ఎవరికోసం రద్దు చేశారో చెప్పాలని అన్నారు. కుమారుడికోసమా? హరీష్ రావు కోసమా? కుమార్తె కవిత కోసమా? అని హేళన చేశారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తామన్న సీఎం హామీ ఏమైందో చెప్పాలని అడిగారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ను అధ్యక్షుడిని చేస్తే రాబోయే ఎన్నికల ఖర్చంతా భరిస్తానని వచ్చిన వార్తలకు ఏం సమాధానం చెబుతారని అని అడిగారు. ఇంత డబ్బు ఎక్కడిదో చెప్పాలని అన్నారు. కేసీఆర్ హామీలపై చర్చకు సిద్ధమా అని ఎర్రబెల్లికి సవాల్ విసిరారు శ్రీనివాసులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news