ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అంత వరకు బాగానే ఉంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది ఒకరకంగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ పార్టీకి సమయం ఉంటుంది. కాని ఇక్కడ అనవసరంగా టీడీపీ నేతలు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది అనే చెప్పాలి.
సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో వాళ్ళు మాట్లాడుతూ ఇది తెలుగుదేశం విజయం అంటూ కొన్ని మాటలు మాట్లాడారు. తెలుగుదేశం విజయం అది ఏ విధంగా అయిందో వాళ్ళే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పోరాటం ఆధారంగా ఎన్నికలను వాయిదా వేసారని అంటున్నారు. ఒక పక్క వైసీపీ విమర్శలు చేస్తుంది. కరోనా కారణంగా కాదు టీడీపీ మీద ప్రేమతో వాయిదా వేసారని.
కాని టీడీపీ నేతలు వైసీపీని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేస్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా చులకన అవ్వడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా వేసారు అనే ప్రచారాన్ని జనంలోకి తీసుకుని వెళ్ళడం మానేసి ఎంత సేపు పట్టులేని ఆరోపణలు, పట్టులేని విమర్శలు చేయడం ద్వారా వాళ్ళ పార్టీని వాళ్ళే ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
వాయిదా ప్రజాస్వామ్య విజయం అని మాజీ మంత్రులు అంటున్నారు. అధికారులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య విజయం అని చెప్పుకున్నా పర్వాలేదు గాని ప్రజాస్వామ్య విలువలను ఎన్నికల సంఘం కాపాడింది అనడం మాత్రం ఇప్పుడు చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి టీడీపీ నేతలు ఎంత కంట్రోల్ లో ఉంటే అంత మంచిది అంటూ పలువురు సలహాలు ఇస్తున్నారు. నష్టపోతున్నా వాళ్ళు ఇలాగే వ్యవహరించడం ఆందోళన కలిగించే అంశం.