నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు టీడీపీ నేతల ఫోన్లు.. పిచ్చాపాటీ మాటలతో బిజీ అయ్యాయి. పనిలో పనిగా కొందరు టూ టచ్‌లో ఉంటే.. మీడియా ప్రతినిధులు తమ్ముళ్లతో కనెక్టయ్యారు. `ఏంటి సార్? విశేషాలు..“.. అని అడిగే లోపే.. విజయవాడకు చెందిన ఓ కీలక సామాజిక వర్గం సీనియర్ నేత.. బుర్ర వేడెక్కింది బెదరూ..` అని మొదలు పట్టి.. మహానాడు విషయం ప్రస్థావించారు. మూడు రోజులు జరగాల్సిన మహానాడు రెండు రోజులకే పరిమితమైందేంటని అడిగేలోపే.. అబ్బబ్బ.. రెండు రోజులకే వాచిపోయింది బెదరూ.. ఇంకో రోజంటే.. కష్టమే అన్నారు. అంతేకాదు. అసలీ మహానాడు ఉద్దేశం కూడా అర్ధం కాకుండా పోయిందని ముక్తాయించారు.
సరే.. పోనీ.. టీడీపీకి బలమైన విశాఖ నగరం విషయానికి వస్తే.. ఇక్కడ ఇటీవల కాలంలో కొంత దూకుడుగా ఉన్న ఓ ఎమ్మెల్యేగారు లైన్‌లోకొచ్చారు. సార్.. ఏంటి? మహానాడు విశేషాలు.. అని టీడీపీకి సన్నిహితంగా ఉండే ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించేసరికి.. ఆ ఏముంటుందమ్మా.. ఎప్పుడూ ఉండేదే! అంటూ.. చెప్పడా నికి కూడా సంశయించారు. ఇక, గుచ్చి గుచ్చి అడిగితే.,. రహస్యంగా ఆయన చెప్పింది ఏంటంటే.. మహానా డులో ఊపు లేదు తమ్ముడూ.. ఏదో పెట్టాం అంటే పెట్టాం.. అన్నట్టు సాగిపోయింది. తీర్మానాలు ఎప్పుడూ చేసేవే. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానం నా చిన్నప్పటి నుంచి వింటున్నా.. కొత్తగా ఏమీలేదు.
అని చెప్పుకొచ్చారు. ఇక, అనంతపురం నేతల టాక్ డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ నుంచి కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి వంటి వారు పాల్గొన్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఏమయ్యారో మాత్రం కనిపించలేదు. ఇక, వీరి లో ఒకరికి ఫోన్ చేయగా.. ఏముందమ్మా.. పోతిరెడ్డి పాడు గొడవతో ఇక్కడ సమస్యలపై మాట్లాడలేక పో యాం. అయినా.. మహానాడులో పస కనిపించలేదు. ఎప్పటిలాగే.. తీర్మానాలు చేశారు. ఎప్పటిలాగే.. అధి కార పక్షంపై ఇంకో నాలుగు విమర్శలు చేశాం. మాకంటూ.. ఏమీ చేసుకోలేక పోవడమే ఇప్పుడు మాకు అసంతృప్తిగా ఉంది. ఇలా మొత్తంగా టీడీపీ నేతలు మహానాడుపై తమదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం.. అదేసమయంలో అధినేత తనదైన శైలిలో ముందుకు సాగడం తప్ప ఈ దఫా మహానాడులో ప్రత్యేకత ఏమీ లేదని అంటున్నారు పరిశీలకులు.