ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ మాత్రం తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేసిన సంగతి స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగు దేశం పార్టీని పదే పదే అధికార పార్టీ నేతలు ఒక పక్క విమర్శలతో ఇబ్బందులు పెడుతూనే తెలుగుదేశం నేతలను తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
తాజాగా ఒక కీలక నేతకు వైసీపీ మంత్రి గాలం వేసారు. ప్రకాశం జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే ఒకరిని పార్టీలోకి తీసుకోవడమే కాదు ఆయనకు ఒక పదవి కూడా ఇవ్వాలని భావిస్తున్నారట. ఆయనకు జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పార్టీలోకి వస్తే కలిసి వస్తుందని భావించి… స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్లస్ అవుతుంది అని భావించే పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట.
ఇప్పటికే సదరు ఎమ్మెల్యే గారితో విజయసాయి రెడ్డి కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. ఆయన పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం. పార్టీలో తనకు గుర్తింపు రావడం లేదని ఆవేదనగా ఉన్న సదరు నేత ఇప్పుడు పార్టీ మారడానికి సిద్దం అయ్యారు అని అంటున్నారు. ఆయన జిల్లాలో అభిమానులు ఎక్కువగా ఉండటమే కాదు… ఆర్ధికంగా కూడా బలమైన నేతగా ఉన్నారు.
వాస్తవానికి ఎమ్మెల్యే గారు పార్టీ మారాలి అని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. కాని ఆయన ఇప్పుడు మారడానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. తాను మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా చంద్రబాబు కనీస౦ తనను పట్టించుకోవడం లేదు అనే ఆందోళన ఎమ్మెల్యే గారిలో ఎక్కువగా ఉందని అంటున్నారు. అందుకే విజయసాయి రెడ్డి చర్చలు జరిపిన వెంటనే మారడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.