తగ్గుతున్న జోరు.. ప్రపంచానికి ఇది శుభపరిణామం…?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా క్రమంగా ఫలిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడి విషయంలో అన్ని దేశాలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల క్రితం కరోనా కేసులు రోజుకి 80 వేల వరకు నమోదు అయ్యేవి… ఇప్పుడు 70 వేలకు పడిపోయాయి.

ఇంకా తక్కువగానే నమోదు అవుతున్నాయి కరోనా కేసులు. రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి. యూరప్ దేశాల్లో కేసులు క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటలీ లో రోజు 15 వేల కేసులు నమోదు అయ్యేవి. ఇప్పుడు… అక్కడ మూడు నుంచి 4 వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయి. స్పెయిన్, జర్మని, ఫ్రాన్స్ దేశాల్లో ఇలాగే ఉంది పరిస్థితి. ఆ దేశాలు క్రమంగా కరోనా వైరస్ ని తరిమేస్తున్నాయి.

వైద్య సదుపాయాలను కూడా వేగవంతం చేస్తున్నాయి. ప్రజలను ఆస్పత్రుల్లో జాయిన్ చేసుకోలేదు ఒకప్పుడు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి.. జనాలను ఆస్పత్రుల్లో జాయిన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇటలీ లో మరణాలు కూడా చాలా వేగంగా తగ్గుతున్నాయి. మంగళవారం 71600 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 1995537కి చేరింది. వారిలో 467226 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రపంచంలోని కరోనా కేసుల్లో 30 శాతం కేసులు అమెరికాలోనే ఉన్నాయి. మంగళవారం ఆ దేశంలో కొత్త కేసులు 25136 రావడంతో… మొత్తం కేసుల సంఖ్య 612077కి చేరుకుంది. అక్కడ మరణాలు కూడా అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఇక మన దేశంలోనే ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. రోజు రోజుకి ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో మూడో దశకు చేరుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news