టీడీపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కి కారణం.. వారి వారి వారసులకు పార్టీ అండగా నిలవలేక పోతున్నదనే తీవ్ర ఆందోళనే! మరీ ముఖ్యంగా పార్టీ కుదురుకునేందు కు మళ్లీ .. ప్రజా పథంలోకి సైకిల్ పరుగులు పెట్టేందుకు సరైన విధంగా వర్కవుట్‌లు చేయడం లేదని అంటున్నారు సీనియర్లు. చంద్రబాబు విషయాన్ని పక్కన పెడితే.. భావి నాయకుడిగా చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌ను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను బట్టి.. బాబు తర్వాత.. లోకేష్ పార్టీకి కీలకంగా ఉంటాడని సీనియర్లు కూడా చెప్పుకొంటున్నారు.
నిజానికి గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసినా.. లోకేష్ ఓడిపోయారు. అయినప్పటికీ.. పార్టీలో ఎక్కడా ఆయన తన హవా తగ్గిపో యేలా కాకుండా దిగులు, చింత లేకుండా వ్యవహరిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా .. అధికార పార్టీపై విమర్శలు గుప్పి స్తున్నారు. మరీముఖ్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు రువ్వుతున్నారు. దీంతో తన రేటింగ్ భారీగా పెరుగుతుందని లోకేష్ భావిస్తున్నట్టు కింది స్థాయి నాయకాగణం చెబుతున్నారు. కానీ, దీనికి విరుద్ధంగా వ్యాఖ్యానిస్తు న్నారు సీనియర్లు. కేవలం నాలుగు విమర్శలు చేస్తేనో.. లేక జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తేనో.. లోకేష్ రేటింగ్ పెరుగుతుందని భావిస్తే.. అంతకన్నా తప్పు మరొకటి ఉండదని చెబుతున్నారు.
దీనికి జగనే పెద్ద ఉదాహరణ అంటున్నారు. కేఈ కృష్ణమూర్తి నుంచి బొజ్జల గొపాల కృష్ణారెడ్డి వరకు, యనమల నుంచి బుచ్చ య్య చౌదరి వరకు సీనియర్లు ఇదే మాట అంటున్నారు. కేవలం విమర్శలతోనే సరిపెట్టిన నాయకులు ప్రజల మనసులు గెలు చుకోలేక పోయారని, ఇప్పుడు ఈ పంథాలో వెళ్తున్న లోకేష్‌కు కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా మంచికైనా.. చెడుకైనా.. జగన్ అనుసరించిన పంథాను అనుసరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిలదొక్కుకునేందుకు 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పటికీ.. జగన్ జనం బాట పట్టారని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని, కేవలం విమర్శలను నమ్ముకునే కంటే.. లోకేష్ ప్రజల బాట పట్టడం మంచిదని అంటున్నారు. మరి ఈ పెద్దల సలహా లోకేష్ రుచిస్తుందా? లేదా? చూడాలి!!