బ్రేకింగ్‌ : చిన్నారి ఆత్మహత్యకు కారణమైన వినోద్ కుమార్ ను సస్పెండ్‌ చేసిన టీడీపీ

-

బ్రేకింగ్‌ : విజయవాడ కు చెందిన చిన్నారి ఆత్మహత్యకు కారణమైన వినోద్ కుమార్ కు మరో షాక్‌ తగిలింది. చిన్నారిని లైంగికంగా వేధించిన వినోద్ కుమార్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ పార్టీ. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం.

TDP

ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడుతూ.. వినోద్ కుమార్ జైన్ అనైతిక చర్యలకు పాల్పడ్డాడని మండి పడ్డాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ కుమార్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అనైతిక చర్యలకు పాల్పడినా.. పార్టీ విధి విధానాలు ఉల్లంఘించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి సంఘటన ల్లో ఎలాంటి వారిని నైనా వదిలి పెట్టేదే లేదని స్పష్టం చేశారు. కాగా.. విజయ్‌ కుమార్‌ లైం గిక వేధింపులు తట్టుకోలేక.. బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version