భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బూమ్రా బ్యాటింగ్ లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ తో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో పదవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన బుమ్రా టి-20 తరహా బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా అరుదైన రికార్డుని అందుకుంది. రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 35 పరుగులు చేశాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి. ఇదే స్టువర్ట్ బ్రాడ్ 2007 t-20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే. కాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా(28) రికార్డును బూమ్రా బద్దలు కొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు, ఒక సింగిల్ ఉంది. ఇదే ఓవర్లో బ్రాడ్ ఏకంగా ఆరు ఎక్స్ట్రాలు సమర్పించుకోవడం గమనార్హం.
Ask your Stuart Broad 😂😂😂#Bumrah 💥💥#INDvsENG pic.twitter.com/XlgeZ7CK3O
— Venky NTR³⁰ 🐯 (@Ntr_Devudu2) July 2, 2022