స్వదేశంలో వరుసగా టెస్టు సిరీస్లు గెలిచి రికార్డు

-

భారత్, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగుటెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో తన కైవసం చేసుకుంది. భారత్ ఈ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది . టీమిండియా సొంత గడ్డపై వరుసగా 16వ టెస్టు సిరీస్ ను కైవసం చేసుకోవడం జరిగింది. స్వదేశంలో 2013 నుంచి వరుసగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ జట్లపై సిరీసులు గెలిచింది టీంఇండియా. అంతేకాకుండా 2016 నుంచి 2023 వరకు వరుసగా 4 సార్లు ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ లు కూడా గెలిచింది. భారత్.. 30 ఏళ్లలో ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. 2000 నుండి స్వదేశంలో 39 టెస్ట్ లు ఆడిన టీమిండియా 31 సిరీసుల్లో గెలిచింది. అత్యధికంగా స్వదేశంలో టెస్టు సిరీస్ లు గిలిచిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ ఆడిన 41 సిరీసుల్లో 32 విజయం సాధించింది.

ఈ నేపధ్యం లో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా కూడా టీమిండియ పటిష్ఠస్థితిలో నిలిచేందుకు విరాట్‌ కోహ్లీనే ప్రధాన కారణమని అన్నారు. విరాట్‌ కోహ్లీ ఎలాంటి క్లాస్‌ ఆటగాడో అందరకి తెలిసిందే అని, అతను సెంచరీతో రాణించడం ఎంతో సంతోషంగా ఉందని రోహిత్‌ తెలిపాడు. అలాగే ఇటివల వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ, ఇప్పుడు రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో సైతం ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. నాలుగో టెస్టులో టీమిండియా పటిష్టస్థితిలో ఉండేందుకు కోహ్లీ కారణమని రోహిత​్‌ తెలిపాడు. దీంతో.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ మెల్లమెల్లగా బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా మారిపోతున్నారని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు అనేక సార్లు వచ్చాయి. అయితే.. ఇటివల వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు చూస్తే మాత్రం అలాంటిదేమి లేదని అర్థం అవుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news