పాకిస్తాన్‌పై టీమిండియా జట్టు ఘన విజయం

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. బర్మింగ్ హామ్ వేదికగా.. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగానే టీమిండియా, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దాయాది పాకిస్థాన్ నిర్ణీత 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే.. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా మహిళలు 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేశారు. 100 పరుగుల విజయలక్ష్మాన్ని కేవలం 11.4 ఓవర్లలోనే ఛేదించారు టీమిండియా అమ్మాయిలు. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.India vs Pakistan Live Score Commonwealth Games 2022: Smriti Mandhana keeps  IND W cruising in chase of 100 vs PAK W | Hindustan Times

స్మృతి మంధన 42 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 8 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 16 పరుగులు చేసి అవుట్ కాగా, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి మంధన స్కోరుబోర్డు ముందుకు నడిపించింది. మేఘన 14 పరుగులు చేసింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అటు, వరుసగా రెండో ఓటమితో పాక్ జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. భారత్ అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్ ను ఆగస్టు 3న బార్బడోస్ జట్టుతో తలపడనున్నారు.