టీమ్ ఇండియా సీనియర్ వికెట్ కీపర్ రాజీనామా

-

టీమ్ ఇండియా మహిళా జట్టు సీనియర్ వికెట్ కీపర్ కరుణ జైన్ రాజీనామా ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌, అన్ని రకాల ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఆమె ఆదివారం వెల్లడించారు. కాగా, కరుణ జైన్ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశారు. తన మొదటి డెబ్యూ మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 64 పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. 2005 నుంచి 2014వ సంవత్సరం వరకు భారత మహిళా జట్టు తరఫున 5 టెస్టులు, 44 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా 1100 పరుగులు చేసింది.

కరుణ జైన్
కరుణ జైన్

భారత మహిళా జట్టుతోపాటు పాండిచ్చేరి, ఎయిర్ ఇండియా కర్ణాటక జట్లకు కూడా ఆమె ఆడారు. రిటైర్మెంట్ ప్రకటించడంతో కరుణ జైన్ ఎమోషనల్ అయ్యారు. క్రికెట్ కెరీర్‌లో ఓ అద్భుత ప్రయాణం కొనసాగి.. ఈ రోజుతో దీనికి ముగింపు పలుకుతున్నానని ఆమె అన్నారు. ఈ జర్నీలో భారత మహిళా జట్టు కోచ్‌, టీమ్ ఇండియా కొలిగ్స్, కుటుంబసభ్యులు తనకు సపోర్టుగా నిలిచారన్నారు. వాస్తవానికి ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఆమె అన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news