సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తేజస్వి మడివాడ.. చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక్కసారిగా హీరోయిన్ గా వరుస ఆఫర్లను దక్కించుకుంది. ఇక తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆర్జీవితో తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో ఈమె అందాల ప్రదర్శనకు కుర్రకారుల సైతం మంత్రం ముగ్గులు అయ్యారు. ఇప్పుడు తాజాగా కమిట్మెంట్ అనే చిత్రంలో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం ఒక అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది తేజస్వి.. ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేజస్వి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.తను మద్యానికి బానిస అయ్యానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.. అందుకు గల కారణం కూడా తెలియజేసింది అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే అందులో ఈ అమ్మడు తన మాటలతో ఆటతీరుతో ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకుంది. ఇక అదే సమయంలో బిగ్ బాస్ లో ఉన్న కౌశల్ ఆర్మీ.. తేజస్విని టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేయడం జరిగిందట.దీంతో తేజస్వి దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆమె తెలియజేసింది.. అయితే దాని నుండి బయటపడడానికే నేను మద్యం అలవాటు చేసుకున్నానని తెలియజేసింది. ఇక అందుచేతనే రెండు సంవత్సరాలు ఇండియాలో లేకుండా బయట తిరిగాను అలా మద్యానికి అలవాటు అవ్వడం వల్లే తన బాడీ షేప్స్, తన లుక్స్ పూర్తిగా మారిపోయాయని తెలియజేసింది తేజస్వి మదివాడ. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.
<iframe width=”853″ height=”480″ src=”https://www.youtube.com/embed/gR1aNKPQcII” title=”Actress Tejaswi Madivada Exclusive Interview | Commitment | Bigg Boss | Mana Stars” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>