ఎరుపు రంగు వినాయకుడిని వినాయక చవితి రోజు పూజిస్తే చాలు..!

-

వినాయక చవితి.. చరిత్రలోనే ఏ దేవుడికీ లేని ప్రత్యేకత వినాయకుడికి ఉంది. అందుకే ఏ దేవుడు కూడా ఇలా భూలోకంలో తొమ్మిది రాత్రులు పూజలందుకొని తర్వాత నిమజ్జనం కాడు. అది కేవలం వినాయకుడికే సాధ్యం. ఏ పని చేయాలన్నా.. ఏ కార్యం చేయాలనా.. ఏ పూజ చేయాలన్నా.. ముందుగా వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మిగితా పూజలను చేస్తుంటారు. వినాయకుడి పూజ తర్వాతనే తమ పనులను మొదలుపెడుతుంటారు. వినాయకుడి పూజకు అంత విలువ.

అందుకే.. భారతదేశం నలుమూలల వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అయితే.. గత జన్మలో చేసిన పాపాలు పోవాలంటే వినాయక చవితి మొదలైన రోజు ఎరుపు రంగు గణేశ్ కు పూజలు చేయాలట. అలా చేస్తే గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయట. ఇంకా.. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, వివాహంలో అడ్డంకులు, ఇలా రకరకాల చింతలతో ఉన్నవారు వినాయక చవితి రోజున ఉదయం నాలుగు గంటలకే నిద్రలేవాలి. అది బ్రహ్మ ముహూర్తం.. ఆ సమయంలో నిద్రలేచి శరీరానికి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. తర్వాత ఎరుపు రంగు వినాయకుడిని పూజించాలి. గణేశుడికి ఎరుపు రంగు పూలమాలనే అలంకరించాలి.

ఉండ్రాళ్లు, ఉలువ గుగ్గిళ్లు వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. దీపారాధన కంటే ముందు ఓం హరసూనవే నమ: అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నెయ్యితో వెలిగించిన దీపాలతో స్వామి వారికి ఆరాధన చేసి.. పూజ అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని నలుగురికి పంచాలి. కుదిరితే ఎవరికైనా వస్త్రదానం చేయాలి. ఆరోజు ఎంత వీలైతే.. అంత తోటివారికి సాయం చేస్తే గత జన్మ పాపాలతో పాటు ఈ జన్మలో అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news