తరచూ భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఏదైనా అపార్ధం కలగడం లేదు అంటే ఇద్దరు మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం లాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కలగొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఆ చిన్నది కాస్తా పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంటుంది.]
అలాంటి సందర్భాలలో కోపాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టకుండా అలాగే దూరంగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిజానికి ఏదైనా సంబంధం సక్సెస్ అవ్వాలంటే ప్రేమ తో పాటుగా అవగాహన కూడా చాలా అవసరం. ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలానే భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే వీటిని అస్సలు మర్చిపోకూడదు. మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.
సమయాన్ని స్పెండ్ చేయండి:
భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించాలి లేదంటే అనవసరంగా దూరం పెరిగిపోతుంది. అయితే భార్య భర్తల మధ్య గొడవలు ఏమైనా వస్తే దూరంగా ఉంటారు. దీనివల్ల వాళ్ళ బంధం మరింత బలహీనం అవుతుంది. ఎప్పుడూ కూడా సమయం కేటాయించి పరిష్కారం చూసుకోవడానికి చూడాలి.
నిర్లక్ష్యం చేయకండి:
ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. దీని వల్ల కూడా ఇంత సమస్య కాస్త అంత సమస్య అవుతుంది. ఎప్పుడూ కూడా మీ పార్టనర్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజానికి ఐదు నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ అవే సర్దుకుపోతాయి.
ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి:
ఒకరి ఫీలింగ్స్ ని ఒకరు అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్య రాదు. ఇతర్లు చెప్పేది ఓపిగ్గా వినండి. అలానే మీరు కూడా ఓపికగా మీ సమస్యని చెప్పి పరిష్కరించుకోవడానికి చూడండి. నిజానికి ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే ఏ భార్యాభర్తల మధ్య సమస్య రాదు.