కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. మే 10వ తేదీన మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన ఈ ఫలితాలను ఎలక్షన్ సంఘం ప్రకటించనుంది. నేటి నుండే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున కర్ణాటకలో పరిస్థితులు ఆసక్తికరంగా మారనున్నాయి. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి.
అందులో భాగంగా బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు కర్ణాటకు వెళ్లనున్నారు. ఈ రోజుల పాటు జరగనున్న ప్రచారం చాలా కీలకంగా మారే అవకాశం ఉండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే తెలంగాణ నుండి డీకే అరుణ, బండి సంజయ్, కిషన్ రెడ్డి , లక్ష్మణ్ , రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లాంటి నాయకులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.