తెలంగాణ అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వని స్పీకర్ పోచారం.

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని నిన్న సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈరోజు ఉదయం కోర్ట్ ఆర్డర్ కాపీతో స్పీకర్ ని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటెల రాజేందర్ లను సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ మరోసారి తన నిర్ణయాన్ని తెలిపారు. సభలోకి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వలేదు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్ది. మా అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్యేలు. 

తమ సస్పెన్షన్ పై కోర్ట్ తీర్పును బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. అయితే స్పీకర్ మాత్రం ఎమ్మెల్యేలను సభలోని అనుమతించేది లేదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు అడ్డుతగులుతున్నారనే ఆరోపణలపై ముగ్గురు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టి సస్పెన్షన్ విధించారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్ట్ ను ఆశ్రయించారు. అయితే నిన్న కోర్ట్ సస్పెన్షన్ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయం అని.. ఈ రోజు స్పీకర్ ని కలిసి మీ అభ్యర్థను తెలియజేయాలని.. స్పీకర్ ని కలిసే విధంగా అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని కోర్ట్ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news