నల్గొండ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. SLBC కి కేబినెట్ ఆమోదం

-

నల్గొండ జిల్లా వాసులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  SLBC ప్రాజెక్ట్ ను అధికారులతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. అనంతరం కేబినెట్ భేటీలో SLBC ప్రాజెక్ట్ గురించి చర్చించారు. 24 నెలల్లో అనగా రెండు సంవత్సరాల్లో SLBC ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వెల్లడించారు. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో SLBC ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టడంతో పెండింగ్ లో పడింది. దీంతో నల్గొండ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాజాగా రూ.4,637 కోట్ల అంచనా వ్యయంతో  ఈ ప్రాజెక్ట్ కి కేబినెట్ లో ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ జిల్లాకు చెందిన  రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2027 సెప్టెంబర్ లోపు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news