బ్రేకింగ్‌ : ఈనెల 16న తెలంగాణ కేబినేట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌ సమావేశానికి ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 16 వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌ కీలక సమావేశం కానుంది. 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌ లో ఈ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఇక సమావేశానికి తెలంగాణ మంత్రి వర్యుల తో పాటు.. ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌. అయితే… ఈ నెల 16 వ తేదీన జరుగబోయే ఈ కేబినేట్‌ సమావేశం లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. దళిత బంధు పథకం అమలు, రైతుల సమస్యలు, భారీ వర్షాలు మరియు కరోనా మహమ్మారి విజృంభణ పై కూడా తెలంగాణ కేబినేట్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.