తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నాం 2గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో చాలా అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ విషయంలో ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుస్తూనే ఉంది. ఇప్పటికే 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ వార్తలు కూడా వచ్చాయి. అందువల్ల మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పుకుంటున్నారు.
అదీగాక, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం, వ్యవసాయం, కరోనా పరిస్థితులపై చర్చ జరగనుంది. థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో కరోనా పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి? దాని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధమవ్వాలి? వ్యాక్సినేషన్ మొదలగు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏది ఎలా ఉన్నా మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాలకు పచ్చజెండా ఊపితే బాగుంటుందని నిరుద్యోగులు అనుకుంటున్నారు. మరి వారి ఎదురుచూపులు ఫలిస్తాయా లేదా చూడాలి.