రుణ సంస్థల తీరుపై కేసీఆర్ ఫైర్

-

రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా రుణ సంస్థలు కొత్త కొత్త షరతులు పెడుతుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల కార్పొరేషన్‌కు రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) తాజా షరతులపై సీఎం దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో మంగళవారం భేటీ నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి 8.30 గంటల వరకు సాగింది.


విశ్వసనీయ సమాచారం మేరకు.. కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్‌కి రుణాలిచ్చేందుకు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ సంస్థలు ఇవ్వాల్సిన మొత్తంలో ఇప్పటికే 80% రుణాలను అందజేశాయి. తాజాగా మూడో పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాలని, కేంద్రం గ్యారంటీ ఇవ్వాలని షరతు పెడుతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

‘ఏ ఒప్పందంలోనైనా షరతులు ముందుగా నిర్దేశించుకుంటాం.. కానీ చివర్లో షరతులు పెట్టడం, ఒప్పందాలను సమీక్షించుకోవడం ఏమిటి’ అని కేసీఆర్.. ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ అంశంపై అధికారులు సలహాలు, సూచనలను సీఎం ఓపిగ్గా విన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news