కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. కార్పొరేషన్‌లకు ఛైర్మన్ల నియామ‌కం

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌… పార్టీ పై దృష్టి పెట్టారు. పార్టీలో కీల‌కంగా ప‌నిచేసిన‌… నాయ‌కుల‌కు వ‌రుస‌గా ప‌ద‌వులు ఇస్తున్నారు. తాజాగా.. పలు కార్పొరేషన్లకు చైర్మన్ల ను నియామ‌కం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ” తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ష‌ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కు ఛాన్స్ ఇచ్చారు. అలాగే… ” తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్” చైర్మన్ గా గజ్జెల నగేష్ ను నియ‌మించారు.

KCR-TRS

“తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్” చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావును నియ‌మించారు కేసీఆర్‌. అలాగే…. ” తెలంగాణ సాహిత్య అకాడమీ” చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్ ను నియ‌మించారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్” చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ .ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇవాళ‌ వెలువడ్డాయి.  ఇక సీఎం కేసీఆర్ చైర్మ‌న్ల‌ను నియామ‌కం చేయ‌డంతో… పార్టీలోని ఇత‌ర నాయ‌కుల్లో కాస్త అసంతృప్తి నెల‌కొన్న‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version