ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయల్దేరారు. తొమ్మిది రోజుల పాటు దిల్లీలోనే ఉన్నారు కేసీఆర్. యూపీలో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ్నుంచి నేరుగా దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ఎంపీలతో చర్చలు జరిపారు. బీఆర్‌ఎస్, టీఆర్ఎస్ కార్యాలయాల పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిపాలన, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిధుల సమీకరణపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో దిల్లీలోనే సీఎం కేసీఆర్ సమీక్షించారు. మరికాసేపట్లో మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష జరపనున్నారు.