వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో దిగుబడి వస్తున్నా.. ముదునష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవలేదని… ఎప్రిల్ మొదటి వారంలో వరి కల్లాల్లోకి వచ్చిన బస్తాలు కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. రైతులను టీఆర్ఎస్, బీజేపీ ఎలా దగా చేస్తున్నాయో రాహుల్ గాంధీ సభ ద్వారా వివరిస్తామని అన్నారు. ప్రతీ మిర్చి రైతు ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టి నష్టపోయాడని… అయినా కేసీఆర్ ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిర్చి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కార్ ముందు చూపు లేని విధంగా… వరి వేసుకోవద్దని చెప్పి రైతుల్ని నష్టం చేశారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు లబ్ధి చేకూరే విధంగా చట్టం తీసుకువచ్చామని.. బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా ప్రోత్సహించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కౌలు రైతులకు సంబంధించి రాహుల్ గాంధీ సభలో కీలక ప్రకటన చేయబోతున్నారని అన్నారు. రైతుల రుణమాఫీపై రాహుల్ గాంధీ సభలో స్పష్టమైన ప్రకటన చేస్తాం. గతంలో రైతులకు లక్ష వరకు రుణమాఫీ ఒకే ధపాలో చేశారని గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ సభలో రైతు రుణమాఫీ, కౌలు రైతుల సంక్షేమంపై కీలక ప్రకటన: ఉత్తమ్ కుమార్ రెడ్డి
-