కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. దేశంలో థర్డ్ వేవ్ వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేసి థర్డ్ వేవ్‌ను ఆదిలోనే అంతం చేశారు. అయితే గత కొన్నిరోజులుగా తెలంగాణలో 200కి పైగా కొత్త కేసులు నమోదవుండటం ఆందోళన కలిగించే విషయం. గడచిన 24 గంటల్లో 28,424 కరోనా పరీక్షలు నిర్వహించగా, 285 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 188 కొత్త కేసులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,95,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,621 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.