తెలంగాణలో ఈనెల 30 తరువాత విద్యా సంస్థల ప్రారంభం…!

-

కరోనా కారణంగా విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. రెండేళ్ల నుంచి వరసగా కరోనా కేసులు, లాక్ డౌన్ల కారణంగా స్కూళ్లు మూతపడుతూనే వస్తున్నాయి. పరిస్థితులు మంచిగా ఉన్నాయని ప్రారంభించే లోపే కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్ధుల ఆన్లైన్ చదువులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 

ఇదిలా ఉంటే తెలంగాణలో ఈనెల 30 తరువాత స్కూళ్ల రీఓపెనింగ్ చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తుందని తెలుస్తోంది. సంక్రాంతికి ముందు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. థర్డ్ వేవ్, ఓమిక్రాన్ భయాల వల్ల సెలవును ఈనెల 30 వరకు పొడగించారు. అయితే జనవరి30 తరువాత సర్కార్ విద్యాసంస్థలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్కూళ్లు తెరవాలని ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువస్తున్నాయి. దీంతో దశల వారీగా స్కూళ్లను రీఓపెన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓమిక్రాన్ వేరియంట్ అంత సీరియస్ కాకపోవడంతో పాటు… టీనేజర్లకు వ్యాక్సిన్ కూడా ఇస్తుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలను తెరిచే ఉద్దేశంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. schools

Read more RELATED
Recommended to you

Latest news