వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 10మంది కొత్తగా కరోనా రోగులు చేరినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం కోవిడ్ వార్డులో మొత్తం 40 మంది తీవ్రమైన శ్వాస ఇబ్బందులతో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ వార్డులో చికిత్స పొందిన 4 గురిని బుధవారం డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు.