తెలంగాణా కరోనా బులిటెన్ విడుదల…ఈరోజు ఎన్ని కేసులంటే ?

-

తెలంగాణాలో మళ్ళీ భారీగానే కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకీ కొంత మేర ఈ కేసులు పెరుగుతూ పోతున్నాయి. కరోనా కేసులు ఎనభై ఐదు వేల మార్క్ ని క్రాస్ చేసి 86,475 కు చేరాయి. తెలంగాణా వైద్యారోగ్య శాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం ఈ రోజు 1931 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా నమోదయిన కేసులు 86,475 కు చేరాయి. ఇక గత 24 గంటల్లో 11 మంది మృతి చెందగా ఇప్పటి దాకా కరోనా వలన చనిపోయిన వారి సంఖ్య 665కు చేరింది.

గడచిన 24 గంటల్లో 1,780 మంది కరోనా బారి నుండి కోలుకోగా ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య 63,074కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి, ఇక ఇందులో 15,621 మంది హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. గడచిన 24 గంటల్లో 23,303 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా 6,89,150 చేసినట్టయ్యింది. ఇక ఎప్పట్లానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 293 కరోనా కేసులు నమోదు కాగా, GHMC- 293, వరంగల్ అర్బన్-144, రంగారెడ్డి-124, మేడ్చెల్-71, పెద్దపల్లి-64, నల్గొండ-84, సంగారెడ్డి-86, ఖమ్మం-73, కరీంనగర్-89 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news