తెలంగాణ లో కొత్త‌గా 190 క‌రోనా కేసులు, ఒక మ‌ర‌ణం

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల‌లో కొత్త గా 190 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తెలంగాణ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య 6,78,478 కి చేరింది. అలాగే రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో క‌రోనా మ‌హ‌మ్మరి కాటు కు ఒక్క‌రు మృతి చెందారు.

దీంతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణం గా 4,008 మంది మ‌ర‌ణించారు. అలాగే ఈ రోజు కరోనా వైర‌స్ ను 198 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రం లో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,70,633 కి చేరింది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రం లో 98.84 శాతం తో రీక‌వ‌రీ రెటు ఉంది. అలాగే రాష్ట్రం లో ప్ర‌స్తుతం 5,336 ​యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news