తెలంగాణ‌లో కొత్త‌గా 162 క‌రోనా కేసులు, ఒక మ‌ర‌ణం

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు.. క్ర‌మ క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా.. 162 క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు న‌మోద‌య్యాయి. అలాగే.. నిన్న ఒక్క రోజులో.. కేవ‌లం ఒక‌రు మాత్ర‌మే క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హమ్మారి కేసుల సంఖ్య 6,80,413 కు చేరింది. అలాగే… క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,019 కు చేరింది. ఇక ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3547 గా న‌మోదు అయింది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 210 క‌రోనా నుంచి కోలు కోగా… మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 6,72,847 గా న‌మోదు అయింది. అలాగే.. గ‌డిచిన 24 గంట‌ల్లో.. 35,037 క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ‌. దీంతో మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 2,94,68,944 కు చేరింది. ఇక తెలంగాణ లో ఇప్పటివరకు 38 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news