తెలంగాణలో మద్యం అమ్మకాలు రోజు రోజుకు జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే 7 శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్టుగా అధికారులు వెల్లడించారు. 2024-25 ప్రొహిబిషన్ ఎక్సైజ్ కి 34,600 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల రూపంలో ఆదాయం రూ.264.50 కోట్లు వచ్చిందని తెలిపారు. 2024-25 సంవత్సరంలో పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ.70000 కోట్ల సొమ్ము వచ్చిందని వెల్లడించారు.
2024-25లో సంవత్సరంలో 531 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోల్చితే.. బీర్ల అమ్మకాల్లో 3 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపారు. బీర్ల కంపెనీలు 15 రోజుల పాటు సరఫరా నిలిపి వేయడంతో తగ్గుదల కనిపించింది. బీర్ల ధరలు పెంచడంతో బీర్ల అమ్మకాలు కొద్ది మేరకు తగ్గిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సేల్స్ పెరిగాయి. గతంలతో పోల్చితే ప్రతీ ఏడాది మాదిరిగానే తెలంగాణలో మద్యం అమ్మకాల్లో పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు.