బీజేపీలోకి తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌..!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం రంజుగా మారుతోంది. జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువ అవుతున్నాయి. ఏపీలోనూ, తెలంగాణ‌లోనూ ఎక్కువుగా అధికార పార్టీలో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకే చేరిపోయేందుకు నేత‌లు ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్ నేత‌గా ఉన్న ఓ సీనియ‌ర్ కూడా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. పార్టీలోకి వ‌స్తే మీ హోదాకు త‌గిన‌ట్టుగా గౌర‌వించుకుంటామ‌ని చెప్ప‌డంతో ఎట్టకేల‌కు మోత్కుప‌ల్లి బీజేపీలో చేరేందుకు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

మోత్కుప‌ల్లి బీజేపీ ఎంట్రీ విష‌యాన్ని ఆయ‌న స‌న్నిహితులు కూడా ధృవీక‌రించిన‌ట్టు టాక్‌. అన్నీ అనుకున్నట్టు జరిగితే సోమ‌వార‌మే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. ఇక తెలంగాణ రాజ‌కీయాల్లో మోత్కుప‌ల్లి ఓ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌గా ఉన్నారు. టీడీపీలో ఉన్న‌ప్పుడు ఆయ‌న ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడేవారు. చంద్ర‌బాబు రాజ్య‌స‌భ ఇప్పిస్తాన‌ని… చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని చెప్ప‌డంతో ఆయ‌న సైలెంట్‌గా ఉన్నారు.

చివ‌ర‌కు ఈ రెండు హామీల్లో ఏదీ నెర‌వేర‌లేదు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర్యారు. టీడీపీలో వేటు పడిన తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇక తెలంగాణ‌లో ప‌ట్టు సాధించే క్ర‌మంలో కాంగ్రెస్, టీడీపీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్న బీజేపీ ఈ క్రమంలో మోత్కుపల్లిపై దృష్టిసారించింది. ఈ క్ర‌మంలోనే మోత్కుప‌ల్లి పార్టీలో చేరేలా చేయ‌డంలో కిష‌న్‌, ల‌క్ష్మ‌న్ స‌క్సెస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news