Breaking News : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా ప్రజలకు తీపికబురు చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కాలేజీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వైద్య కళాశాలకు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు ఈ నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేకంగా ఫించన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు సీఎం కేసీఆర్. మొత్తం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే.. వాళ్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందని వివరించారు సీఎం కేసీఆర్. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిఫారసు మేరకు డయాలసిస్ పేషెంట్లకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వాళ్లకు బస్ పాసులు ఇస్తున్నామని, ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, ఇటీవల డయాలసిస్ కేంద్రాలు కూడా పెంచామని తెలియజేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 10-12 వేల మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాళ్లకు ఇప్పటి వరకు ఇస్తున్న సేవలతో కలిపి కొత్తగా ‘ఆసరా’ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version