తెలంగాణ రైతులకు శుభవార్త.. వడ్డీతో సహా రుణాలు మాఫీ !

హుజరాబాద్ ఉప ఎన్నికకు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో… అన్నీ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి పార్టీలు. ఇక ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు… తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు. త్వరలోనే రుణమాఫీ తో పాటు వాటి వడ్డీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

హుజూరాబాద్ నియోజకవర్గం లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే… రైతులందరికీ మంచి జరుగుతుందని… వృద్ధాప్య పెన్షన్ 57 సంవత్సరాలకు తగ్గిస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. అలాగే ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.

టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తేల్చిచెప్పారు హరీష్ రావు. అసలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం ఏం చేశారని నిలదీశారు. ఒకవేళ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ గెలిస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. కాబట్టి ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.