ఆ ఛానళ్లకు మంచు విష్ణు వార్నింగ్.. హద్దులు మీరొద్దు!

-

అక్టోబర్ 10వ తేదీన జరిగిన మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు తో పాటు ప్యానల్ సభ్యులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు మంచు విష్ణు. ఇందులో భాగంగానే ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన మంచి విష్ణు…. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల పై యూట్యూబ్ ఛానల్స్ వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. కొన్ని యూట్యూబ్ ఛానల్ నటీ నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయని… అలాంటి యూట్యూబ్ ఛానల్ లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంచు విష్ణు. తంబు నైల్స్ హద్దులు మీరినా… హీరోయిన్ల పై అసభ్యకర వీడియోలు పెట్టినా అస్సలు ఊరుకోబోమని హెచ్చరించారు. యూట్యూబ్ ఛానల్ నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మంచు విష్ణు.

Read more RELATED
Recommended to you

Latest news