ఆన్ లైన్ తరగతులు నిషేధించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ…!

-

ఆన్​లైన్​ తరగతుల ప్రభావం పిల్లలపై మానసికంగా, శారీరకంగా ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిటిషన్ వేయగా ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆన్‌లైన్‌, దూరవిద్య ద్వారా తరగతులు ప్రారంభించాలని చెప్పామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీనిపై మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. రెండు రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం సంబంధించి వివరాలను ప్రకటిస్తామంది.

telanaga high court
telanaga high court

ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన విధివిధానాలు కూడా ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యాశాఖ పరిధి పాఠశాలలకే వర్తిస్తుందా…? అని కోర్టు ప్రశ్నించింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నాయన్న హైకోర్టు.. 10 ఏళ్లలోపు పిల్లలు గంటల తరబడి పాఠాలు ఎలా వినగలరో తెలపాలంది. ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోను పాఠాశాలలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని.. విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని హైకోర్టు వెల్లడించింది. ఆన్ లైన్ తరగతులకు వైఖరి వెల్లడించేందుకు మరికొంత సమయం సీబీఎస్ఈ కోరింది. విచారణను ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news