తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల…ఇలా చెక్ చేసుకోండి !

తెలంగాణ రాష్ట్రం లోని ఎంబిఎ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే.. ఐసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రీ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు 19, 20 వ తేదీల్లో మూడు సెషన్ లలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ icet.tsche.ac.in ను చూడవచ్చు. ఐసెట్ ఫలితాల్లో 90.09 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ కు చెందిన లోకేష్ మొదటి ర్యాంకు సాధించగా… సాయి తనుజ రెండో ర్యాంకు సంపాదించారు. ఇక మేడ్చల్ కు చెందిన నవ నక్షత్ర మూడో ర్యాంకు సాధించగా.. మేడ్చల్ కు చెందిన రాజశేఖర్ చక్రవర్తి నాలుగో ర్యాంకు సంపాదించారు. అలాగే కృష్ణాజిల్లా కు చెందిన ఆనంద్ పాల్ ఐదో ర్యాంకుకు కైవసం చేసుకున్నారు. ఇక ఈ పరీక్షకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 56, 962 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు.