తెలంగాణ జనసమితి విలీనంపై కోదండరాం క్లారిటీ…

-

తెలంగాణలో 80 శాాతం మిల్లులు పారాబాయిల్డ్ మిల్లులే ఉన్నాయని… కొంత మంది మంత్రులు పారాబాయిల్డ్ అంటే అదేరో కొత్త రకం ధాన్యం అని అనుకుంటున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు అంశంపై విచిత్ర ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం కొంటాం అంటుంది కానీ… పారాబాయిల్డ్ కొనం అంటుంది అని.. కొంత కాలం పారాబాయిల్డ్ కొనడం తప్పదని.. కేంద్రాన్ని కొంత కాలం బాయిల్డ్ రైస్ కొనేలా రాష్ట్ర ప్రభుత్వ అడగాలని ఆయన అన్నారు. పోడు సమస్య ఇంకా తీవ్రంగానే ఉందని.. వీటిని ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆయన అన్నారు.

kodandaram tjs - Telangana Janasamithi
 

రైతు రక్షణ యాత్రను కామారెడ్డి, కోరుట్ల, సిరిసిల్ల ప్రాంతాల్లో నిర్వహించాలని, క్రిష్ణా జలాల పరిరక్షణ యాత్రను నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించాలని, ప్రజారక్షణ పరిరక్షణ యాత్రను నిర్వహించాలని కమిటీలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఎప్రిల్ 9న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి యాత్ర ఉంటుందని… మిగతా అంశాలపై కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని కోదండరాం అన్నారు. ఇటీవల కాలంలో ఆప్ లో టీజేఎస్ విలీనం అవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కోదండరాం క్లారిటీ ఇచ్చారు.  కలిసి వచ్చే వారితో కలిసి ఉద్యమాలు చేస్తాంమని.. పార్టీ విలీనం గురించి చర్చలు జరగలేదు కోదండరాం స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news