కోర్ట్ కు వెళ్లినంత మాత్రాన ఏమీ జరగదు… బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై మంత్రి జగదీష్ రెడ్డి

-

అసెంబ్లీలో సస్పెన్షన్ కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల న్యాయపోరాటం చేస్తామనడంపై మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. కోర్ట్కు వెళ్లినంత మాత్రన ఏమీ జరగదని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బాద్యతలేని ప్రతిపక్షాలు ఉన్నాయని విమర్శించారు. ప్రజారంజక పాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రతిబింభించేలా ప్రతిపక్షాలు వ్యవహరించడం లేదని అన్నారు. సభలో నిలబడి ధైర్యంగా మాట్లాడలేని వారు సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అందుకనే ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని అన్నారు. సభను సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సభ్యులపై సభాపతి చర్యలు తీసుకున్నారని అన్నారు. బీఏపీ తీర్మాణాలను ఉల్లంఘించి బీజేపీ ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకువచ్చారని అన్నారు. సభను అడ్డుకుంటామనే బీజేపీ చిల్లర ఆటలు సాగనీయమని అన్నారు. ప్రతీ సభ్యుడు శాసన సభలో మర్యాదగా నడుచుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం చేస్తున్న సహాయ నిరాకరణను సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం అని జగదీష్ రెడ్డి అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news