తెలంగాణ ‘మోడల్‌ స్కూల్స్’ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూల్ లలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి లో ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈరోజు నుంచి ప్రారంభమ య్యాయి.

ఆరో తరగతితో పాటు ఆయా మోడల్ స్కూల్ లలో 7 నుంచి 10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు కూడా జనవరి 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ ఉషారాణి ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆసక్తి కలిగిన విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మోడల్ స్కూల్ లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ స్కూల్ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్ 16న నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news