శృతి హాసన్: చిరంజీవి,బాలయ్య బాబులు చాలా డిఫరెంట్.!

-

తెలుగు పరిశ్రమలో శ్రుతి హాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురు గా అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు. మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు అర్ధం అవుతుంది. తాజాగా ఆమె నటించిన సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 13 న బాలయ్య బాబు తో వీర సింహ రెడ్డి  సినిమా 12 న సంక్రాంతి పండుగ కు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.

ఇ క ప్రమోషన్స్ లో బాగంగా ఇంటర్వ్యూ లు ఇస్తూ సందడి చేస్తోంది. తాజాగా శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. నిజానికి ఇది నేను ఊహించలేదు. నా కెరీర్ లో ఇలా జరగడం రెండోసారి. ఏడేళ్ళ క్రితం నేను నటించిన రెండు లు ఒకేసారి విడుదల అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి  బాలకృష్ణ గారు, చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఈ విషయంలో చాలా అదృష్టంగా ఫీలౌతున్నా అని అంది.

అలాగే చిరంజీవి, బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం సరికొత్త అనుభూతిని కలిగించింది. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. సుందరి పాట చాలా బాగా వచ్చింది. అలాగే శ్రీదేవి చిరంజీవి పాట కూడా సూపర్ గా ఉంటుంది.అలాగే బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో పని చేయడం గొప్ప అనుభవం. బాలకృష్ణ గారు చాలా పాజిటివ్ ఎనర్జీ తో వుంటారు. దేవుడ్ని బలంగా నమ్ముతారు. చిరంజీవి గారు చాలా ప్రశాంతత, సున్నితంగా వుంటారు. వారిద్దరి నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది శ్రుతిహాసన్.

 

Read more RELATED
Recommended to you

Latest news