త్వరలో మార్కెట్‌లోకి టీఎస్ఆర్టీసీ బ్రాండ్‌ తాగునీరు

-

కరోనా విజృంభించినప్పటి నుంచి నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు యాజమాన్యం ముప్పుతిప్పలు పడుతోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీలో ఎన్నో చర్యలు చేపట్టింది. ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని చేకూర్చే మార్గాలను అన్వేషించింది. వెంటనే వాటిని అమలు కూడా చేసింది. అయినా ఆర్టీసీ ఆదాయం ఆశించిన స్థాయిలో సమకూరకపోవడంతో మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాల వైపు యోచన చేసింది. అందులో భాగమే ఆర్టీసీ బ్రాండ్ వాటర్ బాటిల్స్.

ఇప్పటికే పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. త్వరలో సీసాలతో మంచినీటి (వాటర్‌ బాటిళ్లు) విక్రయాలకూ రంగం సిద్ధం చేస్తోంది. సొంత బ్రాండ్‌ పేరిట ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించేందుకు గత వారంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది.

అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ప్రముఖ కంపెనీల ద్వారా మంచినీటి బాటిళ్లను తయారు చేయించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మీదట సొంత బ్రాండ్‌ నీటినే ఇచ్చేందుకు నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news