తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర..ఇలా అప్లై చేసుకోండి

-

తెలంగాణ ఆర్టీసీ లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది యాజమాన్యం. ఆర్టీసీలోని ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టుల కోసం.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం రోజున ఆర్టీసీ సంస్థ ఓ ప్రకటన లో వెల్లడించింది.

బీటెక్‌, బీఈ గ్రాడ్జ్‌యేట్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి, బీఏ,బీకాం, బీబీఏ, బీసీఏ పట్ట భద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఈ నెల 16వ తేదీలోపు.. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

ఈ దరఖాస్తుల సమర్పణకు ముందు www.mhrdnats.gov.in తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే అదే వెబ్‌ సైట్‌ లో తెలంగాణ ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐటీ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక దీని పూర్తి వివరాలను రెండు రోజుల్లో www.tsrtc.telangana.gov.in వెబ్‌ సైట్‌ లో పెడతామని స్పష్టం చేసింది ఆర్టీసీ.

Read more RELATED
Recommended to you

Latest news