Telangana : రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ చేతికి సచివాలయ భద్రతా బాధ్యతలు

-

తెలంగాణ నూతన సచివాలయ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. మరో పది రోజుల్లో ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ప్రారంభోత్సవం రోజు నుంచే సచివాలయంలో కార్యకలాపాలు మొదలుపెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే నూతన సచివాలయం భద్రత బాధ్యత చేతులు మారబోతోంది.


ప్రస్తుతం ఈ వ్యవహారాల్ని ప్రత్యేక భద్రతాదళం (ఎస్‌పీఎఫ్‌) పర్యవేక్షిస్తుండగా.. ఇకపై రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) చేతుల్లోకి రాబోతోంది. ప్రస్తుతం దాదాపు 100 మంది ఎస్‌పీఎఫ్‌ సిబ్బందితో భద్రత కొనసాగుతుండగా కొత్త సచివాలయంలో 650 మందికి పైగా పహారా కాయనున్నారు. పలు విడతలుగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాల అనంతరం సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్‌ఎస్‌పీ చేతికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మూడు పటాలాల (350 మందికి పైగా) టీఎస్‌ఎస్‌పీ సిబ్బందితోపాటు దాదాపు 300 మంది సాయుధ రిజర్వు (ఏఆర్‌), శాంతిభద్రతల పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. వాహనాల రాకపోకల నియంత్రణకు 22 మంది ట్రాఫిక్‌ పోలీసులనూ కేటాయిస్తున్నారు. ఎంపిక చేసిన సిబ్బందికి ఇప్పటికే మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణ ఇచ్చారు. ఈ నెల 23 లేదా 24 నుంచి వీరి పర్యవేక్షణ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news