BREAKING : శ్రీకాకుళం ‌‌జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటన…పలు హార్బర్‌లకు శంకుస్థాపన

-

శ్రీకాకుళం ‌‌జిల్లాలో నేడు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మూలపేట పోర్ట్, వంశధార ఎత్తిపోతల‌, బుడగట్ల పాలెంఫిషింగ్ హార్బర్‌లకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్ధాల కలను నెరవేరుస్తూ శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్దికి బాటలు వేసే విధంగా సంతబోమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు ఇవాళ భూమి పూజ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

10 ఏళ్ళలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్ధితుల్లో, కేవలం 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం, శరవేగంగా నిర్మాణం, కాకినాడ సెజ్‌ పోర్టులో శరవేగంగా సాగుతున్న పనులు, మచిలీపట్నం పోర్టుకు కూడా శంకుస్ధాపన చేయనున్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ. 365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుండి హిర మండలం రిజర్వాయర్‌కు రూ. 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ. 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా నేడు (19.04.2023) శంకుస్ధాపన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news