హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్లు

-

హైదరాబాద్ వాసులకు శుభవార్త అందింది. నగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్లు రానున్నాయి. ముంబై తరహాలో హైదరాబాద్ రోడ్ల పైన త్వరలోనే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టిఎస్ఆర్టిసి నిర్ణయించింది.

అయితే ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఖరీదు రూ. 2.25 కోట్ల వరకు ఉండడం, అంత ఖర్చును భరించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపాదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం 4-5 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

క్రాస్ కాస్ట్ విధానంలో ఈ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని టెండర్ నోటిఫికేషను కోరనుంది. అద్దె పద్ధతిలో బస్సులు నిర్వహించే సంస్థతో టెండర్ దక్కించుకున్న సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఆర్టీసీకి బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్ చొప్పున నిర్ధారిత అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news